తెలంగాణ ఎక్స్ ప్రెస్,(13) మహబూబ్నగర్:-
శ్రీరాముల కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని టీయూ డబ్ల్యూ జే(ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ అన్నారు. శుక్రవారం వెల్దండ మండలం రాచూరు గ్రామానికి చెందిన పాత్రికేయుడు శ్రీరాములు అస్వస్థకు గురై మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా శ్రీరాములు పార్థివదానికి నివాళులర్పించి అనంతరం ఆయన మాట్లాడుతూ,. గత కొంతకాలంగా అనేక పత్రికల్లో పనిచేసి అస్వస్థకు గురై మృతి చెందిన శ్రీరాములు కుటుంబానికి మనో ధైర్యాన్ని కల్పించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు. స్వర్గీయ శ్రీరాములు
కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల హెల్త్ కార్డులను పునర్ధరించాలని, అస్వస్థకు గురైన జర్నలిస్టులకు తక్షణమే వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయమై టీయూడబ్ల్యు జె (ఐ జే యు) రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాములు,స్థానిక జర్నలిస్టులు పట్టాభి కృష్ణయ్య బాలయ్య శ్రీను రవి శివ శంకర్ పరమేష్ వెంకటేష్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
.
