తెలంగాణ ఎక్స్ప్రెస్ మహబూబ్నగర్:-
బ్యాంకర్లు కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జంనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. శుక్రవారం జడ్చర్ల పట్టణంలోని గంజిలో నూతనంగా ఏర్పాటుచేసిన పాలమూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ LTD ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జడ్చర్ల పట్టణం వ్యాపారస్తులతో భారీ పెట్టుబడులు పెట్టే వ్యక్తులు ఉన్నటువంటి పట్టణం కాబట్టి బ్యాంకర్లు సకాలంలో కస్టమర్లకు సహకారం అందించి వారి అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో AMC చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత , వైస్ చైర్మన్ సారిక, AMC వైస్ చైర్మన్ రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
