– చోరీల మీద చోరీలు..?
– జిల్లా పోలీసు యంత్రాంగం విఫలం అవుతూ ఉందా..?
– పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.
నారాయణపేట జిల్లా, ప్రతినిధి, డిసెంబర్ 13 (తెలంగాణ ఎక్స్ ప్రెస్): నారాయణపేట జిల్లా కేంద్రంలో అనునిత్యం ఏదో ఒక చోట చోరీలకు తెగబడుతున్న చోరగాళ్లు, ఇదే కోవలో గురువారం రాత్రి అందాజా 11 గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ బాస్ ఉండే కార్యాలయం ఎదురుగా ఉన్న కేబిఎస్ బ్యాంక్ ఏటీఎం నీ డిస్ప్లేను ధ్వంసం చేసి డబ్బు దోచుకునే ప్రయత్నం లో దొంగ విఫలమయ్యాడని తెలియ వచ్చింది. ఇంత తతంగం ఎస్పీ కార్యాలయం ఎదుట జరుగుతున్న పెట్రోలింగ్ వ్యవస్థ ఏమైనట్టు..? సెంట్రి గార్డు కను దృష్టికి అతి దగ్గరలోనే ఈ ఏటీఎం ఉన్నప్పటికీ వారి దృష్టి, కర్ణభేరీలు పనిచేయలేదా అంటూ పట్టణ ప్రజలు గుసగుసలాడుతున్నారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు వేట ప్రారంభించి అట్టి నిందితుడిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం తెలియ వచ్చింది.

