శేరిలింగంపల్లి, డిసెంబర్ 13(తెలంగాణ ఎక్సప్రెస్ ):
శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి సర్కిల్ 20 పరిధిలోని కొండాపూర్ డివిజన్లో గల సిద్ధిక్ నగర్ లో గురువారం జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు పలు అక్రమ నిర్మాణాలను సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. ఇటీవల సిద్ధిక్ నగర్ లో భవనం ఒరిగిన ఘటనలో శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలపై సర్వే చేపట్టారు.ఈ క్రమంలో సిద్దిక్ నగర్ లో ఆరు అక్రమ నిర్మాణాలను సీజ్ చేశారు. అండర్ సెక్షన్ 451 ఏ ఆఫ్ జిహెచ్ఎంసి యాక్ట్ 1955 ప్రకారం అక్రమ నిర్మాణాలను సీజ్ చేస్తున్నట్లు ఏసిపి వెంకట్ రమణ తెలిపారు. ఇప్పటికే 20 భవనాల యజమానులకు నోటీసులు జారీ చేశామని మరి కొంతమందికి నోటీసులు ఇవ్వాల్సి ఉందన్నారు.ఇందులో భాగంగానే గురువారం సిద్ధిక్ నగర్ లో ఆరు అక్రమ నిర్మాణాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

