శేరిలింగంపల్లి, డిసెంబర్ 12(తెలంగాణ ఎక్సప్రెస్ )
శేరిలింగంపల్లి చందానగర్ డివిజన్ లోగల పిజేఆర్ స్టేడియంలో సన్ షైన్ గ్లోబల్ స్కూల్ వారు గురువారం నిర్వహించిన “ఖేల్ మహోత్సవ్” 2024 కార్యక్రమానికి అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కృష్ణ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్, రాష్ట్ర యువజన నాయకులు రాగం అభిషేక్ యాదవ్ లతో కలిసి ముఖ్య అతిధులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు.అనంతరం ఒలింపిక్ జ్యోతి ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సన్ షైన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు పలు పోటిల్లో గెలుపొందిన ప్రధమ, ద్వితీయ, తృతీయ విజేతలకు కార్పొరేటర్ మెడల్స్ వేసి షిల్డ్ లను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఫిట్నెస్ పై అవగాహన కల్పిస్తూ చేపట్టిన “ఖేల్ మహోత్సవ్” లో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇందుకు ముందుకొచ్చిన నిర్వాహకులను అభినందించారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి వహించాలని అన్నారు. శేరిలింగంపల్లి లోని అన్ని స్కూల్స్ ఇలాంటి స్పోర్ట్స్ మీట్ ను ఏర్పాటుచేసి ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సన్ షైన్ గ్లోబల్ స్కూల్ ఛైర్మెన్ పవన్ కుమార్, ప్రిన్సిపాల్ రాధిక, టీచర్స్ చిన్మయి, వాణి, ఉష, చంద్రశేఖర్, సరిత మరియు విద్యార్థులు వారి తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.