Home తాజా వార్తలు ప్రణాళిక బద్దంగా అభివృద్ధి పనులు చేపడుతాం

ప్రణాళిక బద్దంగా అభివృద్ధి పనులు చేపడుతాం

by Telangana Express

*– సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి*

*-పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం*

శేరిలింగంపల్లి, డిసెంబర్ 12(తెలంగాణ ఎక్సప్రెస్ )

శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ నానక్ రామ్ గుడా లో రూ 59.00 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మరియు నేతాజీ నగర్ లో రూ 30.00 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం కాలనీ వాసులతో మరియు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్ నిర్మాణ పనుల్లో నాణ్యతా విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని అదేవిధంగా రాబోవు కాలంలో కాలనీ వాసులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరి చూసుకుంటూ వీలైనంత త్వరగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు వారు సూచించారు. గచ్చిబౌలి డివిజన్ లో ప్రణాళిక బద్దంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని పనులు చేపట్టి కాలనీలలో మౌనిక వసతులు కల్పించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు.గచ్చిబౌలి డివిజన్‌ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలకు మేలైన మౌలిక వసతుల కల్పనకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ రషీద్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు శివ సింగ్,సీనియర్ నాయకులు, కైలాష్ సింగ్ , మాజీ కౌన్సిలర్ ప్రకాశ్ సింగ్, శ్రీకాంత్ రెడ్డి,లోకెందర్ రెడ్డి, సుమన్ ,బబ్లూ సింగ్, విశాల్ సింగ్, శివ రాజ్ సింగ్, సునీల్ సింగ్, అనాయ్ సింగ్ , రవీందర్ సింగ్ జై సింగ్, రాజా సింగ్, శాంకేశ్ సింగ్,వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ ,భిక్షపతి, నానక్ రామ్ గుడా వాసులు, నేతాజీ నగర్ కాలనీ వాసులు,స్థానిక నేతలు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment