జుక్కల్ డిసెంబర్ 12 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన మహా పడిపూజలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మాల ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో దీక్ష చేయడం అందరికీ సాధ్యం కాదని, అతికొద్ది మందికే ఈ అవకాశం రావడం వారి అదృష్టం అని అన్నారు..
జుక్కల్ నియోజకవర్గం ప్రేమ, ఆప్యాయతలు, ఆధ్యాత్మికతకు పేరుగాంచిందని, ఈ సాంప్రదాయాన్ని మనం ఇలాగే కొనసాగించాలని సూచించారు..
అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని,
స్వామి వారి చల్లని ఆశీస్సులతో జుక్కల్ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు..