ఎల్లారెడ్డి, డిసెంబర్ 11,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనిలో గల చర్చ్ ముందు రోడ్డు గతుకుల మయంగా మారింది. బుధవారం వార్డు కౌన్సిలర్ నీలకంఠం గతుకుల మయంగా మారిన రోడ్డుపై మొరం వేయించి ట్రాక్టర్ డోజర్ ద్వారా చదును చేయించారు. దీంతో గతుకుల రోడ్డు సాఫీగా మారింది. మొరంతో గుంతలను పూడ్చడం పట్ల హౌసింగ్ బోర్డు కాలని వాసులు కౌన్సిలర్ ను అభినందించారు.
