Home తాజా వార్తలు జి పి. కార్మికులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి

జి పి. కార్మికులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి

by Telangana Express

బిచ్కుంద డిసెంబర్ 11 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బుధవారం జరిగిన గ్రామపంచాయతీ కార్మికుల సమావేశంలో సి.ఐ.టి.యు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సురేష్ గొండ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గ్రామపంచాయతీ కార్మికులకు 18 వేల రూపాయల వేతనం. ఉద్యోగ భద్రత,పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తూ కార్మికులకు యూనిఫామ్ డ్రెస్కోడ్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.ప్రస్తుత అసెంబ్లీ సీతకాల సమావేశంలో గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్లపై చర్చ చేయాలని లేనిచో ఈనెల 17న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు.కార్యక్రమంలో జిపి కార్మికుల బిచ్కుంద మండల అధ్యక్షుడు రూప్ సింగ్, కార్యదర్శి ఈ సాయిలు,బిచ్కుంద అధ్యక్షుడు భూమయ్య. కార్యదర్శి సుశీల బాయి కార్మికులు,శంకర్, బంగారం,పురేందర్, లింగూరం,బాజీరావు, శకుంతల,రత్నవ్వ,గంగవ్వ బిచ్కుంద మండలంలోని వివిధ గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment