బిచ్కుంద డిసెంబర్ 9:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కాంగ్రెస్ పార్టీ జాతీయ అగ్ర నాయకురాలు తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ 78వ పుట్టినరోజు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కవిత రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.
సోనియా గాంధీ గారిని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంచాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొక్కసారి సోనియాగాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రోగులకు పండ్ల పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, ఉపాధ్యక్షుడు రవి పటేల్, బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు అనిల్ పటేల్, డెలికేట్ విట్టల్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, శాంతాపూర్ వెంకటరెడ్డి, గోపనపల్లి గంగారం సార్, తుకారం, హనుమంతరావు దేశాయ్, కలీం, గుండె కల్లు రాజు పటేల్ కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు