Home తాజా వార్తలు రుద్రారం చెరువులో చేపలకు చికెన్ వ్యర్ధ పదార్థాలు… ఈ మాఫియాను అరికట్టాలి

రుద్రారం చెరువులో చేపలకు చికెన్ వ్యర్ధ పదార్థాలు… ఈ మాఫియాను అరికట్టాలి

by Telangana Express

👉 సబ్ కలెక్టర్ కార్యాలయంలో మూడవత్ జగన్ నాయక్ ఫిర్యాదు

మిర్యాలగూడ నవంబర్ 27 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మిర్యాలగూడ మండలం రుద్రారం గ్రామంలో చాపల చెరువులో చికెన్ షాప్ లో నుండి చికెన్ వ్యర్ధ పదార్థాలను తీసుకెళ్లి కొంతమంది వ్యాపారస్తులు చాపల చెరువులో వీటిని కలుపుతున్నారని, ఈ మాఫియాను అరికట్టాలని ప్రజల జంతువుల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ మూడవత్ జగన్ నాయక్ ఆధ్వర్యంలో యువకులు బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని డి ఏ ఓ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జగన్ నాయక్ మాట్లాడుతూ
వ్యర్ధాలతో పెరిగిన చాపలు ప్రజలు తినడంతో
గుండె సంబంధిత వ్యాధులు, అనేక రకాల వ్యాధులకు గురే పరిస్థితి నెలకొందన్నారు.
వ్యర్ధాల ద్వారా వచ్చే దుర్వాసనకు ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయని, చెరువులో నీరు బోర్ వెల్(చేతి పంపు) ద్వారా రావడం వల్ల ప్రజలకు పశువులకు అనారోగ్యానికి గురై
పరిస్థితి ఉందని ఈ మాఫియాను అరికట్టాలని ఇచ్చిన వినతి పత్రంలో కోరారు.ఈ కార్యక్రమంలో సూర్య నాయక్, బురాన్, తరుణ్, పవన్, పాల్గొన్నారు.

You may also like

Leave a Comment