చేగుంట నవంబర్ 27 తెలంగాణ ఎక్స్ ప్రెస్
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో రాజ్యాంగంపై ఉపన్యాస పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా చేగుంట మండల విద్యాధికారి నీరజ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఒక శాసనమని, దాన్ని ప్రజలందరూ గౌరవించాలని, రాజ్యాంగం ను రాజ్యాంగ సవరణ ద్వారా సవరించుకోవచ్చని , భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని, దీనిని రచించడానికి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని, రాజ్యాంగ రచనలో 299 పాల్గొన్నారు అని, అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చల్లా లక్ష్మణ్,సురేందర్, ,వెంకటేష్, మనోహర్ రావు, శ్రీవాణి, రమ, రమాదేవి, భవాని, సరస్వతి,ఉమా, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు