లోకేశ్వరం నవంబర్ 26
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
75 వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని లోకేశ్వరం మండలం రాజుర గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో
మా అమ్మానాన్న పౌండేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు యం. ఆంజనేయులు, దాదాపు 100 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె రాజేశ్వర్, మాజీ సర్పంచ్ ముత్తగౌడ్, వి డి సి చైర్మన్ దాసరి ప్రవీణ్, పాఠశాల కమిటీ చైర్మన్ సాయి ప్రసాద్,అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షులు ఆర్లా మోహన్,అర్లా విలాస్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు