ఎల్లారెడ్డి, నవంబర్ 26,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణం లోని శివాజీ పులే అంబేద్కర్ కార్యాలయంలో, మంగళవారం 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని దళిత సంఘాల నాయకుల అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత ఐక్యవేదిక కార్యాచరణ మహాసభ తెలంగాణా యువజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు టీ.యన్ రమేష్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేశారు. ఆతర్వాత ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా స్వేచ్చగా జీవించడానికి కారణం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి కంతి పద్మారావు, దళిత ఐక్యవేదిక కార్యాచరణ మహాసభ తెలంగాణా యువజన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు జెగ్గ కృష్ణ, ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఎల్లారెడ్డి డివిజన్ అధ్యక్షులు ప్రదీప్ కుమార్, పట్టణ అధ్యక్షులు రొడ్డా నరేష్, ఉపాధ్యక్షులు రాజు, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు శివానందం మాజీ మండల అధ్యక్షులు పర్వయ , తదితరులు పాల్గొన్నారు.