ఎల్లారెడ్డి, నవంబర్ 26,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణ శివారులో గల మోడల్ స్కూల్ ను , మంగళవారం రీజినల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్, ఏం ఓ రవి కుమార్ లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. పిదప విద్యార్థులతో మాట్లాడారు, విద్యాబోధన ఎలావుందీ అని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ ను పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గాంధీ , వైస్ ప్రిన్సిపల్ జహంగీర్, తదితరులు ఉన్నారు.