తెలంగాణ ఎక్స్ ప్రెస్ 23/11/24
భైంసా పట్టణం లోని ఏస్ఎస్ ప్యాక్టారి ఆధ్వర్యంలో
విజయోత్సవ సంబరాల్లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసినచోట మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైందని నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో ఎన్డీఏకి కూటమి భారీ ప్రభంజనం సృష్టించడంతో బైంసాలోని ఎస్. ఎస్.జిన్నింగ్ ఫ్యాక్టరీలో టపాసులు పేల్చి, సంబరాలు జరుపుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. బిజెపి ప్రభుత్వ హాయంలో మహారాష్ట్రలో పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయన్నారు.లాడ్ కీ బహిన్ పథకంతో 60 సంవత్సరాలు లోపు ప్రతి ఆడపడు చుకు మహారాష్ట్రలో నెలకు 1500 రూపాయలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాని దేనన్నారు. మహాలక్ష్మి,పథకం ఇస్తానని గద్దెనెక్కి, ఇప్పటికీ ఆడపడుచులకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదన్నారు . తెలంగాణలో ఏదో సాధించామని ఎన్నికల ప్రచారంలో తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రి, అధికార పార్టీ నాయకులు తిరిగినా, వారి మాటలను నమ్మకుండా ప్రజలు బిజెపి కూటమికి పట్టం కట్టారన్నారు. విజయోత్సవ సంబరాల్లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపాల్ సర్దా, బైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, నాయకులు సోలాంకి భీమ్ రావ్, శివాజీ పటేల్, బాజీరావ్ పటేల్, వెంగల్ రావ్, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ లు, ఎం పి టి సి లు తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్రలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి
44