ముధోల్:15నవంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కుల గణన సర్వేకు గ్రామస్తులు అందుబాటులో ఉండి పూర్తిస్థాయిలో వివరాలను తెలియజేయాలని ఎం పీడీవో శివకుమార్ అన్నారు. శుక్రవా రం మండల కేంద్రమైన ముధోల్ తో పాటు మండలంలోని ఆయా గ్రామా ల్లో ఎన్యూమెటర్లు ఇంటింటా తిరుగు తూ కుల గణన సర్వేను చేస్తున్నారు. ముధోల్ లోని 3 వార్డులో ఎన్యూమెట ర్ పోశెట్టి సామాజిక,ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను వివ రాలను నమోదు చేసుకుంటున్నారు. సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా కుటుంబాలకు సంబంధించిన ఖచ్చిత మైన సమాచారాన్ని నమోదు చేయా లన్నారు.ఎలాంటి పొరపాట్లకు తావి వ్వకుండా సర్వేను పూర్తి చేయాలని కొనసాగాలి కొనసాగే విధంగా చూడాలని అన్నారు. ఈ సర్వేలో మాజీ వార్డ్ సభ్యుడు ఎంఏ ఆజిజ్ తో పాటు తదితరులున్నారు