Home తాజా వార్తలు రైస్ మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదు

రైస్ మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదు

by Telangana Express
     ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 02/11/24
భైంసా మండలము కేంద్రం లోని
దేగామ్ గ్రామం లోని రైతు వేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పవార్ రామారావు మాట్లాడుతూ
వరి ధాన్యం కొనుగోళ్ల విషయం లో రైస్ మిల్లర్లు రైతులకు కోత విధిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హెచ్చరించారు.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సైతం కోత విధించవద్దన్నారు.. శనివారం భైంసా మండలం లోని దేగాం, వలేగాం, కుంసరా, ఎగ్గామ్, వానల్పాడ్, పెండ్ పెల్లి గ్రామాల్లో పి. ఎ. సి. ఎస్., డి. సి. ఎం. ఎస్. ల ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కోత విధించవద్దని రైతుల పక్షాన జిల్లా కలెక్టర్ తో మాట్లాడడం జరిగిందని, అక్రమాల నివారణకు విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యా, వైద్యం, రైతాంగానికి సాగునీరు అందించడమే ధ్యేయంగా తాను పనిచేస్తున్నానని దశలవారీగా సమస్యల పరిష్కారానికి పాటుపడతానన్నారు.. దేగాం గ్రామానికి చెందిన నాయకులు పలు సమస్యలు విన్నవించడంతో సిరాల ప్రాజెక్టు ద్వారా దేగాం రైతంగానికి సాగునీరు అందిస్తానన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను,పరిష్కరించేందుకు తనవంతుగా పాటుపడతానన్నారు. కార్యక్రమాల్లో పిఎసిఎస్ చైర్మన్ ఆ మెడ దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, నాయకులు సోలంకి భీమ్రావు, సాంళి రమేష్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు సిరం సుష్మ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్, గణేష్ పటేల్,మాజీ సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు దిగంబర్, సాయినాథ్, ప్రసాద్, చందర్ పటేల్, సాయ రెడ్డి, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, పిఎసిఎస్ సెక్రటరీ, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment