ముధోల్01నవంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండలంలోని అష్ట గ్రామానికి చెందిన దిలార్పూర్ భూమన్న అనే రైతుకు చెందిన గేదె ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో గురువారం మృతి చెందింది. రైతు భూమన్న తెలిపిన వివరాల ప్రకా రం రోజు మాదిరిగానే పంట పొలాల్లో మేత కోసం గేదె వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడిక క్కడే మృతి చెందినట్లు తెలిపాడు. సంఘటన స్థలాన్ని పశువైద్యాధికారి రవీందర్ పరిశీలించి పోస్టుమార్టం ని ర్వహించారు.మృతి చెందిన గేదె వి లువ రూ. 60 వేల వరకు ఉంటుం దని బాధిత రైతు వాపోయా డు.ప్ర భుత్వం తరుపున నష్టపరిహారం చూడాలని రైతు వేడుకున్నాడు
విద్యుత్ షాక్ తో గేదె మృతి
50
previous post