Home Epaper టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్ష, కార్యవర్గం

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్ష, కార్యవర్గం

by Telangana Express
  • అధ్యక్షుడు కె.నారాయణ రెడ్డి (ఆంధ్రజ్యోతి)
  • ప్రధాన కార్యదర్శి శివ శంకర్ ( మహ టివి)
  • కార్యవర్గంలో నారాయణపేట మండలానికి తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు చోటు.

నారాయణపేట జిల్లా ప్రతినిధి అక్టోబర్ 28 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
టీయూడబ్ల్యూజే ఐజేయు నారాయణపేట జిల్లా అధ్యక్షునిగా కోయిలకొండ నారాయణరెడ్డి (ఆంధ్రజ్యోతి), ప్రధాన కార్యదర్శిగా శివశంకర్ ( మహా టీవీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం నారాయణపేట జిల్లా కేంద్రం లోని శ్రీ లక్ష్మీ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన జిల్లా ప్రథమ మహాసభలో టియూడబ్ల్యుజే(ఐజెయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదుగౌడ్, ఎన్నికల కమిటీ కన్వీనర్ వెంకట్, కో కన్వీనర్ శేఖర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోగా జిల్లా కమిటీని రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ ఆమోదించినట్లు రాష్ట్ర డిజిటల్ మీడియా కార్యవర్గ సభ్యుడు రఘు గణప తెలిపారు. అలాగే ముగ్గురు జిల్లా ఉపాధ్యక్షులుగా హనమంతు (హెచ్ఎం టీవీ), వెంకట్( ప్రైమ్ న్యూస్) గురు ప్రసాద్(సాక్షి), అదనపు కార్యదర్శిగా లింగప్ప( జనం సాక్షి), కార్యదర్శిగా అజీజ్ అహమద్ ఖాన్ (సియాసత్), విఠోబా (సాక్షి), అశోక్ (నమస్తే తెలంగాణ), మహమ్మద్ (తఖి), కోశాధికారిగా మధుకర్ (ప్రజాపక్షం), ప్రచార కార్యదర్శిగా సురేష్ (దిశ), హెల్త్ కన్వీనర్ గా సంజీవ్ ప్రకాష్ (మన తెలంగాణ), ఎడ్యుకేషన్ కన్వీనర్ గా రాజేష్ (సాక్షి), క్రమశిక్షణ కన్వీనర్ గా శ్రీధర్ (వన్ టీవీ), లీగల్ సెల్ కన్వీనర్ గా బాల్ రాజ్ (మన తెలంగాణ), జిల్లాలోని 13 మండలాలకు మండలానికి ఒకరు చొప్పున 13 మంది కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా శేఖర్ (సూర్య), షబ్బీర్ (ఆంధ్రజ్యోతి), నరసింహులు (వార్త), వీరేష్ (సాక్షి), మన్సూర్ అహమద్ (సియాసత్), వీరన్న( ఆంధ్రజ్యోతి), ఎల్లారెడ్డి ( వెలుగు), ప్రహల్లాద రెడ్డి(ఆంధ్రజ్యోతి), సురేష్ (అక్షరజ్యోతి)
ఆంజనేయులు (ఆంధ్రజ్యోతి), రమేష్ అల్వాల్ (తెలంగాణ ఎక్స్ ప్రెస్), షఫీ (దిశ), రమేష్ గౌడ్ (దిశ) లు ఎన్నికయ్యారు.

You may also like

Leave a Comment