Home తాజా వార్తలు తెలంగాణ స్టూడెంట్ యూనియన్ కార్యదర్శిగా జన్నారం మండల చంద్రశేఖర్ నియామకం

తెలంగాణ స్టూడెంట్ యూనియన్ కార్యదర్శిగా జన్నారం మండల చంద్రశేఖర్ నియామకం

by Telangana Express

మంచిర్యాల, జూన్ 20, (తెలంగాణ ఎక్స్ ప్రెస్) జన్నారం:- తెలంగాణ స్టూడెంట్ యూనియన్ కార్యదర్శిగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదం పెళ్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి చంద్రశేఖర్ నియామకమయ్యారు. తెలంగాణ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు నల్లగొండ అంజి రాష్ట్ర కార్యదర్శిగా చంద్రశేఖర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ క్రమశిక్షణ గల నేతగా తెలంగాణ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షునిగా ఆశయాలను విద్యార్థిని విద్యార్థులోనికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమాలు పోరాటాలు చేస్తానన్నారు. టిఎస్సీ రాష్ట్ర అధ్యక్షుని ఆదేశాల మేరకు విద్యార్థులకు జరిగిన వాటిపై సైనికుడిగా అలుపెరుగని పోరాటం చేస్తానని చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థుల సమస్యలపై టి ఎస్ సి ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం జరగాలని చేస్తానన్నారు. రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన గ్రామాల్లో, ఆదివాసుల, గిరిజన గ్రామాలలో పేద విద్యార్థులకు విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాల నిర్మాణాలను ప్రారంభించి తమ వంతు సహకారం చేస్తారని అన్నారు. నిరంతరం పోరాటం చేస్తానని, గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు అయ్యేవరకు నిరంతరం పోరాటం ఆగదని తెలిపారు. చంద్రశేఖర్ కు తెలంగాణ స్టూడెంట్ యూనియన్ కార్యదర్శిగా పదవి కల్పించిన రాష్ట్ర అధ్యక్షునికి ధన్యవాదాలు తెలిపారు.

You may also like

Leave a Comment