మంచిర్యాల జూన్ 2 తెలంగాణ ఎక్స్ ప్రెస్): తెలంగాణ దశబ్ధి ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా జన్నారం మండలం తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి జన్నారం పోలీస్ బందోబస్తు నడుమ జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతిపిత, రాజ్యాంగ నిర్మాత మొదటి ప్రధాని, తెలంగాణ సిద్ధాంతకర్త, పలువురు చిత్రపటాలకు తాసిల్దార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూఎన్నో పోరాటాలు, మరెన్నో ప్రాణ త్యాగాలు, బతుకు కోసం, భాష కోసం అలుపెరగక సాగిన సమరంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించి నేటికి పది ఏండ్లు పూర్తి ఐనా సందర్భముగా ప్రజలందరికీ తాసిల్దార్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన 11 వందల మంది పైగా వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను ప్రతిరూపంగా సకల జనుల సమ్మె, వేలాది మంది ఆత్మ బలిదానులతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో అగ్రస్థానానికి చేరుకోవాలని సాధించుకున్నారు. అదేవిధంగా జన్నారం మండలంలోని వివిధ పార్టీల నాయకులు ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, మండల ఎంపీడీవో, పోలీస్ స్టేషన్, ఎంఈఓ, ప్రాథమిక ఆరోగ్య దవాఖాన, పంచాయతీల్లో తెలంగాణ దశబ్ధి ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జాతీయ త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలు, తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది, పాల్గొన్నారు.
ఘనంగా జన్నారం మండలంలో తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
48