మిర్యాలగూడ మే 5 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలిపించాలని కోరుతూ మిర్యాలగూడ మండలం బోట్య నాయక్ తండ గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం రైతుబంధు సమితి నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు, బిఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు, చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

అధికారంలో వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత ఏర్పడిందన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సరిగా అమలు చేయడం లేదన్నారు. జరుగనున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డి కారు గుర్తుకు ఓటేసి..

అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, సీనియర్ నాయకులు జొన్నలగడ్డ రంగారెడ్డి, మాజీ ఎంపీపీ జానయ్య, రైతుబంధు మండల సమితి మాజీ అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సీకే ప్రసాద్, గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు సురేష్ నాయకులు సాగర్ నాయక్ రాంబాబు, మున్ని నాయక్, కుప్ల నాయక్, పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు.