Home తాజా వార్తలు పెగడపల్లిలో కాంగ్రెస్ ప్రచారం

పెగడపల్లిలో కాంగ్రెస్ ప్రచారం

by Telangana Express

బోధన్ రూరల్,మే3:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గడపగడపకు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జి.శంకర్, మోహన్, షబీర్, మల్లారెడ్డి, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment