మిర్యాలగూడ మే 3 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కోదాడ పట్టణంలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ చేశారు. ఉత్తమ్ పద్మావతి నగర్ కాలనీలో ఆయన వాకర్స్ తో ముచ్చటించారు.

బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో కుందూరు రఘువీర్ రెడ్డి స్థానికులతో కలిసి వాలీబాల్ ఆడారు. రంగా థియేటర్ సమీపంలోని రోడ్డు పక్కన ఓ చాయ్ వాలాతో సరదాగా ముచ్చటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కుందూరు రఘువీర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను ఎంపీగా గెలిచిన తదుపరి ఎమ్మెల్యే పద్మావతితో కలిసి కోదాడ మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. నల్గొండలో తన విజయం పక్కా అని, మెజార్టీపైనే తాము దృష్టి సారించామన్నారు.

తమ కార్యకర్తల సహకారంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానని కుందూరు రఘువీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.