-సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గడ్డం సదానందం పిలుపు
కేయులో లౌకిక విలువలు సాహిత్యం అనే అంశంపై జరుగు తున్న సభపై ఎబివిపి చేసిన దాడికి ఖండన
మంచిర్యాల, ఏప్రిల్ 30, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కార్పొరేట్, దోపిడీ అనుకూల, మననువాద, ఫాసిస్టు బిజేపిని దాని మిత్ర బ్రుందాన్ని ఓడించాలని సిపిఐ (యం.యల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గడ్డం సదానందం ప్రజలకు పిలుపు నిచ్చారు. సందర్భంగా హన్మకొండ లోని సిపిఐ (యం, యల్ ) మాస్ లైన్ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి చిర్ర సూరీ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కార్పొరేట్, దోపిడీ అనుకూల మనువాద, ఫాసిస్టు ఆర్ఎస్ఎస్, బిజేపిలను ఓడిచాలనే పిలుపుతో జరిగిన జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో గడ్డం సదానందం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బొట్ల రాకేష్, అర్షం అశోక్, బి నరసింహారావు, ఏ శ్రీనివాస్, అడ్డూరి రాజు, కె శివ మైదం పాణి, పి నర్సయ్య,ఎండి హసన్ తదితరులు పాల్గన్నారు. డాక్టర్ పసునూరి రవీందర్, నరేష్ కుమార్ సూఫీ, మెర్సి మార్గరెట్ తదితర రచయితలు మేధావులు, అధ్యాపకులు లౌకిక విలువలు-సాహిత్యం అనే అంశంపై ఈ నెల 28న కాకతీయ విశ్వ విద్యాలయం సెనెట్ హాల్లో నిర్వహించు కుంటున్న రాష్ట్ర స్థాయి సదస్సును భగ్నం చేయటానికి ఎబివిపి కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడీ హేయమైనా చర్య అని, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలని కోరారు. ఇలాంటి దాడులు, దౌర్జన్యాలతో లౌకిక ప్రజాస్వామ్య హక్కుల కోసం మాట్లాడే, పోరాడే శక్తులకు రక్షణ లేకుండా పోతుందని ఎత్తి చూపారు.
కేంద్రంలో బిజేపి అధికారంలోకి వచ్చినప్పటినుండి మనువాద ఫాసిస్టు మూకల దాడులు దౌర్జన్యాలకు అడ్డు లేకుండా పోయిందంటూ మండిపడ్డారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్, ఎబివిపి సంఘ్ పరివార్ మనువాద ఫాసిస్టు మూకల ద్వారా దాదాపు మూడువేలకు పైగా దాడులు జరిగాయంటు తెలిపారు. నేటి వరకు వారిపై ఎలాంటి పోలీసు కేసులు నమోదు కాలేదని గుర్తుచేశారు. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో మనువాద, ఫాసిస్టు బిజెపిని ఓడించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆతర్వాత చిర్ర సూరీ, అర్షం అశోక్, పిడిఎస్ యు నాయకులు బి నరసింహా రావు, ఏ శ్రీనివాస్ లు మాట్లాడుతూ ఏబీవీపీ జరుగుతున్న సభపై అకారణంగా దాడిచేసి, ఫ్లెక్సీలను చించి, దౌర్జన్య చర్యలకు పాల్పడడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ దాడిని వెంటనే కట్టడి చేయ వలసిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించటం సరైనది కాదని అన్నారు. ఈ దాడీకి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, చట్టపరంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని, పోలీసు ఉన్నతాధికారలను డిమాండ్ చేసారు. అలాగే 2024 మే 10న ఉదయం 11 గంటలకు హన్మకొండ హంటర్ రోడ్, న్యూ శాయంపేటలోని నందనార్ మాల కళ్యాణ వేదిక హాలులో పార్లమెంట్ ఎన్నికల్లో కార్పొరేట్ దోపిడీ అనుకూల మనువాద ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బిజెపిని దాని మిత్రపక్షాలను ఓడిద్దాం అనే అంశంపై ఉమ్మడి వరంగల్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.వరంగల్ జిల్లా కార్యదర్శి చిర్ర సూరి అధ్యక్షతన జరిగే జనరల్ బాడీ సమావేశంలో మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య ప్రారంభోపాన్యాసం చేస్తారని, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జాతీయ నాయకులు పోటు రంగారావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాయల చంద్ర శేఖర్, గడ్డం సదానందం, చిన్న చంద్రన్నలు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం లౌకికవాద సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు ఆర్ఎస్ఎస్ బిజెపి మనువాద కార్పొరేట్ ఫాసిస్టులను దాని మిత్రపక్షాలను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించవలసిన అవసరాన్ని వివరించ నున్నారని గుర్తుచేశారు.