ఎల్లారెడ్డి, ఏప్రిల్ 19,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ మరమ్మత్తు పనులను విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి ఎల్ సి తీసుకున్న తర్వాతే పోల్స్ ఎక్కాలి అని, విద్యుత్ శాఖ ఎస్ ఈ రమేష్ బాబు సూచించారు. శుక్రవారం ఎల్లారెడ్డి విద్యుత్ ఆపరేషన్స్ పరిధిలోని ఎల్లారెడ్డి, లింగం పేట్, గాంధారి, నాగిరెడ్డి పేట్ 4 మండలాల విద్యుత్ సిబ్బందితో, ఎన్ పి డీ సి ఎల్ సీ ఏం డి ఆదేశాల మేరకు లింగంపేట మండల కేంద్రం లోని రైతు వేదికలో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఈ మాట్లాడుతూ, గృహ, గృహేతర విద్యుత్ వినియోగ దారులకు నాణ్యమైన విద్యుత్తు ను అందజేయడం జరుగుతుంది అని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడంలో సిబ్బంది అప్రమత్తత ఎంతో అవసరం అని, ప్రమాదం జరగకుండా విద్యుత్ మరమ్మత్తుల పనులు చేసే విషయంలో ముందుగా, సిబ్బంది సబ్ స్టేషన్ నుంచి ఎల్ సీ తీసుకున్న తర్వాతే పోల్స్ ఎక్కి మరమ్మత్తు పనులు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఎర్త్ రాడ్ తో గ్రౌండ్ ఎర్త్ తప్పనిసరిగా చేయాలి అని, లైన్ పోల్ క్రాసింగ్ పనులు చేసే సమయంలో ఎర్త్ రాడ్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. పనులు చేసే సమయంలో అజాగ్రత్త వహిస్తే ప్రాణాలకే ముప్పు అని హెచ్చరించారు. విద్యుత్ డి టీ ఆర్ (ట్రాన్స్ ఫార్మర్) లను ఎప్పటి కప్పుడు మరమ్మత్తులు చేసి , అవసరమైతే ఆయిలింగ్ చేసి, విద్యుత్ వినియోగ దారులకు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలని ఆదేశించారు. అక్రమంగా విద్యుత్ చౌర్యం జరగ కుండా విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆతర్వాత విద్యుత్ టెక్నికల్ డి ఈ ఈ వెంకట రాంబాబు విద్యుత్ సిబ్బందికి విద్యుత్ సరఫరాలో తలెత్తే సాంకేతిక సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే విషయాన్ని వివరించారు. ప్రతి ఒక్క విద్యుత్ సిబ్బంది తమ ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని, పని చేసి, సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. అనంతరం ప్రమాదాలు జరగకుండా విధులు నిర్వహిస్తామని సిబ్బంది చే ప్రతిజ్ఞ చేయించారు. ఈ విద్యుత్ సిబ్బంది అవగాహన సదస్సులో ఎస్ ఈ రమేష్ బాబు, డి ఈ ఈ (టెక్నికల్) వెంకట రంగయ్య, ఎల్లారెడ్డి డివిజనల్ ఆపరేషన్స్ డి ఈ ఈ గణేష్, ఏడీ ఈ సుదర్శన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, డీ ఈ ఈ ఆపరేషన్స్ పరిది లోని ఎల్లారెడ్డి ఎఈ సత్యనారాయణగౌడ్, లింగంపేట్, గాంధారి, సర్వాపూర్, నాగిరెడ్డి పేట్, శెట్పల్లి సంగారెడ్డి విద్యుత్ ఏ ఈ లు, ఫోర్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్ మెన్ లు, జె ఎల్ ఏం లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిబ్బంది ఎల్ సి తీసుకున్న తర్వాతే పోల్స్ ఎక్కాలి…ఎర్త్ రాడ్ వినియోగం తప్పనిసరి…..విద్యుత్ ఎస్ఈ రమేష్ బాబు
71