Home తాజా వార్తలు హనుమాన్ జయంతి శోభాయాత్రను విజయవంతం చేయండి…               వీరహనుమాన్ శోభాయాత్ర గోడప్రతుల ఆవిష్కరానా

హనుమాన్ జయంతి శోభాయాత్రను విజయవంతం చేయండి…               వీరహనుమాన్ శోభాయాత్ర గోడప్రతుల ఆవిష్కరానా

by V.Rajendernath

ఎల్లారెడ్డి, ఏప్రిల్ 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ ):

ఈ నెల 23 న మంగళవారం నాడు హనుమాన్ జయంతి ని పురస్కరించుకుని, ఎల్లారెడ్డి పట్టణంలో నిర్వహించనున్న వీరహనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని విహెచ్పి, భజరంగ్ దళ్ సదస్యులు కోరారు. సోమవారం స్థానిక శ్రీ శ్రీ శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయం వద్ద హనుమాన్ జయంతి శోభాయాత్ర కార్యక్రమాల వివరాలతో కూడిన గొడప్రతులను వారు ఆవిష్క రించారు. ఈ సందర్భంగా విహెచ్పి మండల అధ్యక్షులు నవీన్ చారి, భజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ వినోద్ లు మాట్లాడుతూ, హనుమాన్ జయంతి 23 న మంగళవారం సాయంత్రం 4.00 గంటలకు పప్పు హనుమాన్ మందిరం (సాతెల్లి బేస్ ) నుంచి శోభా యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. యువకులు హనుమాన్ భక్తులు ఈ శోభాయాత్ర లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదే రోజు మధ్యాహ్నం ఆన్న ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. ఈ గోడ ప్రతుల ఆవిష్కరణ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల వి హెచ్ పి అధ్యక్షులు నవీన్ చారి, భజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ వినోద్, పట్టెం కిషన్ , భజరంగ్ దళ్ సంయోజక్ తులసి దాస్, భరత్, లోహిత్, రాహుల్, రాజు, బాలు, వంశీ, మంచిర్యాల విద్యాసాగర్, మత్తమాల ప్రశాంత్ గౌడ్, కుశల కంటి మహేష్, సాయిప్రసాద్, బాల్ రాజు , నరేష్ , గణేష్, అనిల్ నాయక్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment