52
మెదక్, ఏప్రిల్ 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
ఎన్నికల కోడ్ వేళ ఎల్లారెడ్డి మాజీ ఎమ్యెల్యే కారులో డబ్బులు పట్టుబడ్డాయి. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండల శివారులో సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేశారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వాహనంలో రూ.1,80,000 పట్టుబడినట్లు ఘ న్ పూర్ ఎస్ఐ. ఆనంద్ గౌడ్ తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపనందున సీజ్ చేసి కలెక్టర్ కార్యాలయంలో డిపాజిట్ చేశామన్నారు.