-మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి
రాజాపూర్ ,ఏప్రిల్ తెలంగాణ ఎక్స్ ప్రెస్ : ఆశీర్వదించండి భారీ మెజార్టీతో గెలిపించండి అని సి డబ్ల్యూ సి ప్రత్యేక ఆహ్వానితులు మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్ల వంశీచందర్ రెడ్డి అన్నారు.

ఆదివారం మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి రాజాపూర్,బాలానగర్ కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చల్లా వంశీ చంద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికలలో జడ్చర్ల శాసనసభ్యులుగా జనంపల్లి అనిరుద్ రెడ్డి గెలుపుకై ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా కృషి చేశారో అంతకంటే రెట్టింపు ఉత్సాహంగా కష్టపడి పని చేయాసి వచ్చే ఎంపీ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను కోరారు.రెండు మండలాల నుంచి పదివేలకి పైచిలుకు మెజార్టీ తగ్గకుండా మెజార్టీ వచ్చేలా బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు.అదేవిధంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలన్నీ కూడా తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు.కార్యకర్తలే పార్టీకి పునాదిరాళ్లు వారు కష్టపడి పని చేస్తేనే మన లక్ష్యాన్ని చేరుకుంటాం పార్లమెంట్,ఎన్నికల లో ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కష్టపడి పని చేయాలి కష్టపడ్డ వాళ్లకి తప్పక వారికి గుర్తింపు ఉంటుందనీ అన్నారు.మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి బాటలో నడిపించే బాధ్యత నాది.నన్ను ఆశీర్వదించండి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించండి అని కోరారు.

ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ..
మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గడచిన పది సంవత్సరాలలో రోడ్ల కోసం 110 కోట్లు నిధులు తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తాను ఎమ్మెల్యేగా గెలిచి గడిచిన మూడు నెలలలోనే జడ్చర్ల నియోజకవర్గంలో రోడ్ల కోసం 160 కోట్లు నిధులు తీసుకొచ్చానని అన్నారు.
అదేవిధంగా రైతులకు విద్యుత్తు కోసం ఆరు కొత్త ట్రాన్స్ఫార్మర్ను సాంక్షన్ చేయించానని,ఎన్నికల ముందు మాటిచ్చినట్లుగా రంగారెడ్డిగూడ,అగ్రహారం పొట్లపల్లి,గుండ్ల పొట్లపల్లి గ్రామాలకు కలుపుకొని నెక్లెస్ రోడ్ మంజూరు చేయిస్తానని చెప్పినట్లుగా మంజూరు చేయించానని అన్నారు. మిడ్జిల్ మండలంలోని కొత్తూరు నుండి కొత్తపల్లి వరకు 37 కోట్ల నిధులతో డబుల్ రోడ్డు కోసం శాంక్షన్ చేయించానని నియోజకవర్గంలో నీటి కొరత ఉందని ధర్నా చేసిన బిఆర్ఎస్ నాయకులు అయ్యా మీరు పదేళ్లలో ఒక్క అప్లికేషన్ అన్న సంబంధిత శాఖకు రాశారా అని ప్రశ్నించారు.తాను నియోజకవర్గం లో నీటి కొరత ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం రెండు కోట్ల నిధులతో నీటి ఇబ్బంది ఉన్న గ్రామాలలో బోర్లు వేయిస్తున్నానని చెప్పుకొచ్చారు.రెండు మండలాలకు చెందిన ప్రతి ఒక్క కార్యకర్తలు కష్టపడి పనిచేసి చల్ల వంశీ చందర్ రెడ్డి కి 30 వేల పైచిలుకు మెజార్టీ గిఫ్టుగా ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బాలనగర్,రాజాపూర్ మండల ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.