మంచిర్యాల, ఏప్రిల్ 08, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా, జన్నారం మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో బాదంపల్లి గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామంలో ఆ గ్రామ బిజెపి పార్టీని ఏకగ్రీవంగా ఆ గ్రామ కమిటీ సమక్షంలో నియమించుకున్నారు. జన్నారం మండలంలోని బాదం పెళ్లి బిజెపి పార్టీ అధ్యక్షునిగా మోట పలుకుల సత్తయ్య, ఉపాధ్యక్షులు గా దావుల సత్యం, చీపిరి చెట్టి చంద్రయ్య, ప్రధాన కార్యదర్శిగా గడి పెళ్లి నాగేందర్, లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బిజెపి పార్టీ జన్నారం మండల అధ్యక్షుడు గుండవరపు మధుసూదన్ రావు, కొంతం శంకరయ్య, గ్రామ పెద్దలు, నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన బాదంపెల్లి బిజెపి పార్టీ గ్రామ కమిటీ సీనియర్ నాయకులు నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బెడద గోపాల్, మల్యాల మహేష్, మెట పల్క కమలాకర్ మల్యాల శ్రీను, జన్నారం మండలం బిజెపి బీజేవైఎం జన్నారం మండల బిజెపి బిజెవైఎం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బిజెపి మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో బాదంపల్లి గ్రామ కమిటీ ఎన్నిక
50
previous post