తెలంగాణ ఎక్స్ప్రెస్ ప్రతినిధ ఏప్రిల్ 07
పెద్దపల్లి డిస్టిక్ అప్పన్నపేట గ్రామంలో ఉగాది పండుగ పురస్కరించుకొని పోచమ్మ బోనాల పండుగ నిర్వహించుకున్నారు.అప్పన్నపేట గ్రామంలో పూర్వం కొన్ని సంవత్సరాల నుండి ఉగాది పండుగకు ముందు ఊరపోశమ్మకు నైవేద్యంగా బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.ఇందులో భాగంగా పెద్ద సంఖ్యలో ఎస్సీ కాలనీలోని ప్రజలందరూ బోనాల పండుగలో పాల్గొన్నారు.ఇందులో భాగంగా గ్రామ పెద్దలు అయినటువంటి సుద్దాల రామయ్య సుద్దాల లింగయ్య సుద్దాల రాజమౌళి సుద్దాల శంకరయ్య తదితరులు విజయవంతంగా బోనాల పండుగను నిర్వహించినట్లు పేర్కొన్నారు ఇందులో ఎస్సీ కాలనీ వాసు పాల్గొని విజయవంతంగా నిర్వహించుకున్నట్లు తెలిపారు.
