Home తాజా వార్తలు పార్లమెంట్ ఎన్నికలను నిస్పక్ష పాతంగా నిర్వహించాలి….ఎన్నికల నిర్వహణపై పిఓ , ఎపిఓ లకు శిక్షణ…..- అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మన్నె ప్రభాకర్

పార్లమెంట్ ఎన్నికలను నిస్పక్ష పాతంగా నిర్వహించాలి….ఎన్నికల నిర్వహణపై పిఓ , ఎపిఓ లకు శిక్షణ…..- అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మన్నె ప్రభాకర్

by Telangana Express

ఎల్లారెడ్డి, ఏప్రిల్ 2,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

వచ్చే నెల 13 వ తేదీన జరుగనున్న జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలను పిఓ, ఎపిఓలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, స్థానిక ఆర్డీవో మన్నె ప్రభాకర్ సూచించారు. , మంగళవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ అందించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 270 పోలింగ్ కేంద్రాల్లో సజావుగా ఎన్నికలు నిర్వహించడం కోసం ఎల్లారెడ్డి, లింగంపేట్, తాడ్వాయి మండలాల పీఓ, ఎపిఓ లకు కలిపి మొత్తం 372 మందికి మొదటి దఫా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తెలిపారు. మొత్తం 8 గదుల్లో 8 మంది మాస్టర్ ట్రైనర్స్ ప్రిసైడింగ్ , అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు చేయవలసిన, చేయకూడని పనులను గురించి వివరించారు. బ్యాటరీ పూర్తిగా చార్జి అయిందని తనిఖీ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్ ను స్విచ్ అఫ్ చేయాలని, ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించే ముందు మీకు కేటాయించిన ఓటింగ్ యంత్రాల పనితీరుకు, పోలింగ్ ప్రక్రియ గురించి ఏవైనా సందేహం ఉంటే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈవిఎం, వివి ప్యాట్ లను అనధికార ప్రదేశాలకు తీసుకు వెళ్ళవద్దని, రిటర్నింగ్ అధికారి అందించిన వాహనంలో మాత్రమే పోలింగ్ కేంద్రాలకు పోలీసు భద్రత మధ్య వెళ్ళాలి అని వివరించారు.

నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రారంభమయ్యే విధంగా చూసుకోవాలి, మాక్ పోలింగ్ ను 50 ఓట్లు వేసే వరకు అపవద్దని, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవిఎం, వివి ప్యాట్ ల ద్వారా ఓటు నమోదు, సీలింగ్ చేయడం గురించి తెలియజేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వస్తే సహచరుని సహాయంతో ఓటు వేయడానికి ఆనుమతించ బడతాడని తెలిపారు. థర్డ్ జెండర్ ల ఓటు ఏవిధంగా నమోదు చేయాలి, అనే విషయమై వివరించారు. అసలు పోలింగ్ ప్రారంభించే ముందు కంట్రోల్ యూనిట్ నుండి మాక్ పోల్ డేటా ను క్లియర్ చేయడం మర్చి పోవద్దని సూచించారు.

8 గదుల్లో పిఓ, ఎ పిఓ లకు మాస్టర్ ట్రైనర్ లు అందిస్తున్న శిక్షణ తరగతులను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పరిశీలించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మన్నె ప్రభాకర్, తహశీల్దార్ లు అల్లం మహేందర్ కుమార్ , రాజనరేందర్ గౌడ్, మునీరొద్దిన్, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఆర్డీవో కార్యాలయం సిబ్బంది చంద్రభాను, భిక్షపతి, హెచ్ హెచ్ పీ ఇమ్రాన్, డిప్యూటీ తహశీల్దార్ చరణ్ సింగ్ , తహసిల్ కార్యాలయం సిబ్బంది వాణి , శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. బుధవారం సదాశివనగర్, గాంధారి, రాజంపేట, నాగిరెడ్డి పేట్ మండలాల పి ఓ, ఎపిఓ లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని నియోజకవర్గ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మన్నె ప్రభాకర్ తెలిపారు.

You may also like

Leave a Comment