Home తాజా వార్తలు ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి

by Telangana Express
  • పాపన్న గౌడ్ యువజన సంఘం అధ్యక్షుడు గుండ్రాతి కుమార్ గౌడ్

ఆమనగల్లు, ఏప్రిల్ 02
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

బహుజన విప్లవ వీరుడు గోల్కొండ చక్రవర్తి 17వ శతాబ్దంలోనే తెలంగాణలో విప్లవ విత్తనాలు నాటిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా ఆమనగల్లు రాజీవ్ గాంధీ చౌరస్తాలో, పాపన్న గౌడ్ యువజన సంఘం అధ్యక్షుడు గుండ్రాతి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి నిర్వహించారు…. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్వకుర్తి తాలూకా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చుక్క అల్లాజిగౌడ్, ఉపాధ్యక్షులు గంగ రవి గౌడ్, పాల్గొన్నారు. చుక్క అల్లాజీ మాట్లాడుతూ బహుజన విప్లవ కారుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆనాటి పాలకుల అరాచకాలను అణిచివేసి అణగారిన వర్గాల పేదల కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడారని గుర్తు చేశారు. సర్ధార్ పాపన్న ఆశయాలని ముందుకు తీసుకొని వెళ్లాలని పిలుపు నిచ్చారు, అలాగే రాష్ట్రం లో గౌడ్స్ కి సమూచిత న్యాయం చేయాలనీ ఆయన ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు మండల అధ్యక్షుడు చుక్క నిరంజన్ గౌడ్, దూసకంటి యాదయ్య, మున్సిపల్ అధ్యక్షుడు గజ్జె వెంకటయ్య గౌడ్,గజ్జె రాజేష్ గౌడ్,అల్లాజి,గజ్జె కుమార్, ముకురాల నాగయ్య, పల్లె రాజు గౌడ్, గజ్జ శ్రీశైలం పబ్బు పరమేష్, గజ్జ నిరంజన్, గడిగే మల్లేష్, బాలగోని శ్రీకాంత్ గౌడ్, గడిగా లక్ష్మణ్, గుండ్రాతి నరేష్, గజ్జె రాఘవేందర్, మల్లేష్, మనోజ్, పల్లె సురేష్, రామకృష్ణ, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment