మిర్యాలగూడ ఏప్రిల్ 02 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల వెంట వచ్చి సహాయకులకు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ, మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రాం చైర్మన్ మా శెట్టి శ్రీనివాస్ (డైమండ్) ఆధ్వర్యంలో మీల్స్ అన్ వీల్స్ కార్యక్రమం నిరంతరంగా కొనసాగిస్తున్నారు. మంగళవారం మిర్యాలగూడ మండల విద్యాధికారి మాలోతు బాలాజీ నాయక్ బాజు, దంపతుల పెళ్లిరోజు సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమానికి దాతగా వ్యవహరించి సుమారు 300 మందికి కేకు, స్వీటు అల్పాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు కర్నాటి రమేష్, లయన్స్ క్లబ్ ఆఫ్ సిజేఎస్ఎస్ దివ్యాంగ చార్టర్ అధ్యక్షులు కోల సైదులు ముదిరాజ్, లయన్స్ క్లబ్ మిర్యాలగూడ చెందిన బి..ఎం. నాయుడు, తదితర నిర్వాహక సభ్యులు సామా శ్రీనివాస్ పాల్గొన్నారు.

