ముధోల్:01ఏప్రిల్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ సీఈవో సాయరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన ముధోల్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోకుండా ఉండేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. ఏ గ్రేడ్ రకం క్వింటాల్ వరి ధాన్యానికి రూ.2203, బి గ్రేడ్ రకం వరి ధాన్యానికి రూ.2183 మద్దతు ధరను ఇవ్వడం జరుగుతుందన్నారు.రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ప్రవీణ్,రవి,రైతులు తదితరులున్నారు.
రైతులు వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
42
previous post