3 కేంద్రాల్లో కలిపి 703 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు…
– ఎల్లారెడ్డి ఎంఈఓ ఏవి. వెంకటేశం
ఎల్లారెడ్డి, మార్చి 28,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణంలోని మూడు పరీక్ష కేంద్రాలలో, గురువారం నాడు 6 వ రోజు పదవ తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా పార్ట్ 3, బయోలాజికల్ సైన్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగాయని స్థానిక ఎంఈఓ ఎవి. వెంకటేశం తెలిపారు. పట్టణంలోని జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో 240 మంది విద్యార్థులకు గాను అందరు హాజరయ్యారని సిఎస్, డిఓ లు విఘ్నేశ్వర్ రెడ్డి, జబీన తెలిపారు. ఆదర్శ పాఠశాలలో 240 మంది విద్యార్థులకు అందరూ హాజరయ్యారని సిఎస్, డిఓ లు పి. సాయిబాబా, బి. వెంకట రాజు తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 223 మంది విద్యార్థులకు గాను అందరు విద్యార్థులు హాజరయ్యారని సిఎస్, డిఓ లు క్రాంతి కృతామూర్తి, వెంకట రామిరెడ్డి తెలిపారు. మూడు కేంద్రాల్లో కలిపి 703 మందికి అందరు విద్యార్థులు పరీక్షలు వ్రాసారని సిఎస్, డిఓ లు తెలిపారు. ప్రతి విద్యార్థిని ముందుగానే సిబ్బందిచే స్క్రీనింగ్ చేసి, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్ లను సైతం అనుమ తించకుండా క్షుణ్ణంగా తనిఖీ చేసి కాపీయింగ్ కు అవకాశం లేకుండా పరీక్ష గదుల్లోకి పంపించడం జరిగిందని సిఎస్ , డి ఓ లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పట్టణంలోని అన్ని జీరాక్స్ సెంటర్లు పరీక్ష ముగిసే వరకు మూసి ఉంచారు. ఆరోగ్య సిబ్బంది కేంద్రాల వద్ద పరీక్ష ముగిసేంత వరకు అందుబాటులో ఉన్నారు.