Home తాజా వార్తలు విద్యార్థులు పరీక్షలంటే భయాన్ని వీడాలి

విద్యార్థులు పరీక్షలంటే భయాన్ని వీడాలి

by Telangana Express

కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి… – ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ఎల్లారెడ్డి, మార్చి 14,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):విద్యార్థులు పరీక్షలంటే భయాన్ని వీడితే మంచి జి పి ఎస్ మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని, ఎల్లారెడ్డి పట్టణ సీఐ రవీందర్ నాయక్ సూచించారు. గురువారం పోలీసుశాఖా అధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి వార్షిక పరీక్షలకు కష్టపడి కాకుండా ఇష్టపడి సంసిద్దులు కావాలని అన్నారు. ముఖ్యంగా పరీక్ష అనే భయాన్ని మదిలో నుంచి తొలగించాలని సూచించారు. ఇందు కోసం విద్యార్థి ప్రాక్టికల్ గా పరీక్షకు మానసికంగా సిద్ధం అవడానికి చక్కని చిట్కా చెప్పారు.. విద్యార్థి ఇంటి వద్ద ఒక్క ఐదు నిమిషాల పాటు కళ్ళు మూసుకుని పరీక్ష కేంద్రానికి వెళుతున్నట్లు, పరీక్ష కేంద్రంలో పరీక్ష వ్రాస్తున్నట్లు ఊహించుకొని, పరీక్ష కేంద్రానికి వెళ్ళాలని వివరించారు. దీంతో పరీక్ష కేంద్రానికి ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా వెళ్ళి పరీక్ష వ్రాస్తారని దైర్యం చెప్పి చిట్కాను ఆచరించి, ప్రతి విద్యార్థీ పదిలో మంచి జి పి ఎస్ మార్కులతో వంద శాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, తల్లి తండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు అందించేందుకు ముందుకు వచ్చిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి మోహన్ రావుకు సిఐ శాలువా కప్పి సత్కరించారు. అంతకు ముందు స్థానిక ఎంఈఓ ఎవి. వెంకటేశం మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివే బీద విద్యార్థుల పట్ల పోలీసు శాఖా చూపిస్తున్న ఔదార్యానికి దన్యవాదాలు తెలిపారు. మండలంలోని ప్రభుత్వ ఉన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాల, కేజిబి విద్యాలయం కలిపి మొత్తం 405 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను పంపిణీ చేయడం జరుగు తోందని తెలిపారు. ఆయా పాఠశాల హెచ్ ఎం లు ఇక్కడి నుంచి ప్యాడ్ లను తీసుకు వెళ్లి విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను సీఐ, ఎస్ఐ లు, ఎం ఈ ఓ లతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, ఎస్ఐ లు బొజ్జ మహేష్, టి.రాజు, చైతన్య రెడ్డి, ఎం ఈ ఓ లు ఎవి. వెంకటేశం , రామస్వామి, పాఠశాల ఇంచార్జి హెచ్ ఎం లింగమూర్తి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment