Home తాజా వార్తలు ఆదివాసి గిరిజనులపై అటవీ అధికారుల దౌర్జన్యాల నిలిపివేయాలి

ఆదివాసి గిరిజనులపై అటవీ అధికారుల దౌర్జన్యాల నిలిపివేయాలి

by Telangana Express

మంచిర్యాల, మార్చి 14, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా, కవ్వాల్ అభయారణ్యం జన్నారం మండలంలోని పలు గ్రామా లలో ఆదివాసి గిరిజనులపై జరుగుతున్న దౌర్జన్యాలను నిలిపి వెయ్యాలని, ఆదివాసి గిరిజనులు అన్నారు. తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జన్నారం మండలం గ్రామ కమిటీ సమావేశం, మాజీ సర్పంచ్ శంకరన్న అధ్యక్షతన నిర్వహించారు. జన్నారం మండలంలోని ఆదివాసి గిరిజన సంఘం జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య ముఖ్య అతిథులుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, కనికరపు అశోక్, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే అబ్దుల్లా హాజరయ్యారు. జన్నారం మండల గ్రామంలోనీ గిరిజనులపై అటవీ అధికారుల దౌర్జన్యాలు దినం, దినం పెరుగుతున్నాయని, ఆదివాసి గిరిజనుల కుల దేవునికి నీడ కొరకు పందిరి వేసుకుంటే, పందిరి కర్రను సామాన్లన్నీ చిందర వందర చేసి, ఆదివాసి గిరిజనుల పనిముట్లు గడ్డపార,,పారలు, గొడ్డళ్లు గుంజుకుని అటవీ అధికారులు వెళ్లారని, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎస్కే అబ్దుల్లా అగ్రహం వ్యక్తం చేశారు. చదువుకున్న పిల్లలకు ఎటువంటి ఉపాధి లేక, నిరుద్యోగులుగా ఉండలేక, అడవిలో దొరికే వెదురు కర్ర తెచ్చుకొని తడకలు అల్లుకొని బ్రతికే పరిస్థితి ఉన్నదని, అది కూడా కాకుండా అడవి నుంచి వెదురు రాకుండా ఆదివాసి గిరిజనులపై అటవీ అధికారులు అడ్డు వస్తున్నారు. జిన్నారం మండలంలోని గిరిజన ఆదివాసి గూడాలలో ఉండే చెరువులో చేపలు కూడా తినకుండా ఆటంకం చేస్తున్నారని, తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కనికరపు అశోక్ మాట్లాడుతూ, అటవీశాఖ పెట్టిన గేటు వల్ల జన్నారం మండలంలోని ఆదివాసి గిరిజన గ్రామానికి రాకపోకలు స్తంభిస్తున్నాయని, కవ్వాల్ టైగర్ జోన్ వల్ల అడవిలో ఉన్న గిరిజనులకు ఉపాధి కరువై పస్తులు ఉండవలసి వస్తుందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న 6 గ్యారంటీలు అమలు చేయాలని, వీరికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, వీరి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గ్రామానికి రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదివాసి గిరి జిల్లా ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుమలత, ముడితే లక్ష్మి, అరే ఎల్లవ్వ, దాసండ్ల పద్మ, మూతి అనిత, భూమక్క ఆత్రం రాజు, నరసయ్య, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment