Home తాజా వార్తలు నేటి నుంచి ఒంటి పూట బడులు

నేటి నుంచి ఒంటి పూట బడులు

by Telangana Express

– ఎల్లారెడ్డి ఎంఈఓ ఎవి.వెంకటేశంఎల్లారెడ్డి,మార్చి14,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):వేసవి ఎండలు ముదురుతున్న దృష్ట్యా, శుక్రవారం నుంచి 2023-24 విద్యాసంవత్సరం కు గాను అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు ఒంటి పూట బడులు నిర్వహించేలా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఎల్లారెడ్డి ఎంఈఓ ఎవి.వెంకటేశం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 24 వరకు విద్యా సంవత్సరం ముగిసేంత వరకు ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బడులు నిర్వహించేలా ఉత్తర్వుల్లో పేర్కొందని ఎంఈ ఓ తెలిపారు. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులు ఇంటికి వెళ్తారని తెలిపారు. మార్చి 18 నుంచి 30 వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరుగను న్నాయన్నారు. పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు 1.00 గంట నుంచి 5.00 గంటల వరకు తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో ప్రతి విద్యార్థి, ఉపాద్యాయులు తప్పకుండా ప్రార్థన సమయానికి విధిగా హాజరు కావాలని ఆదేశించారు.

You may also like

Leave a Comment