Home తాజా వార్తలు ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షనీయం

ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షనీయం

by Telangana Express

నీలం మధు ముదిరాజ్ కు మెదక్ పార్లమెంట్ టికెట్ కేటాయించాలి రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ కోల సైదులు ముదిరాజ్*మిర్యాలగూడ మార్చి 14 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షనీయమని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్రఆర్గనైజర్ సెక్రెటరీ కోల సైదులు ముదిరాజ్ అన్నారు. గురువారం ముదిరాజ్ మహాసభ జిల్లా, నియోజకవర్గ, పట్టణ నాయకులతో కలిసి సైదులు ముదిరాజ్ విలేకరులతో మాట్లాడుతూముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులమైన ముదిరాజుల చిరకాల కోరికైనా ముదిరాజ్ కార్పొరేషన్ కి ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ముదిరాజులను బీసీ.డీ. నుండి బిసి.ఏ. లోకి మార్చడం వంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పెట్టి ముదిరాజుల మనసులను గెలుసుకుందన్నారు.ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపే ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయటాన్ని యావత్ తెలంగాణ ముదిరాజులు స్వాగతిస్తున్నారని, ముదిరాజుల 45 సంవత్సరాల కళ అయినా బిసి డి నుండి బిసి ఏ లోకి మార్పు అంశాన్ని త్వరలో పరిష్కరించి ముదిరాజ్ యువత విద్యార్థి జీవితాల్లో వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేశారు,పార్లమెంట్ సీట్లలో ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వాలని, మెదక్ పార్లమెంట్ పరిధిలో సుమారు 5 లక్షల మంది ముదిరాజ్ ఓటర్లు ఉన్నారని ముదిరాజులు అత్యంతగా అభిమానించే నీలం మధు ముదిరాజ్ మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డిను కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహా సభ మిర్యాలగూడ నియోజకవర్గం అధ్యక్షులు ఆధారపు మురళి ముదిరాజు , బంటు సైదులు బిజెపి, బంటు శ్రీనివాసు సింగిల్ విండో చైర్మన్, కోల రామస్వామి, లింగంపల్లి శ్రీనివాసు, లింగంపల్లి మట్టయ్య ,కొంక వెంకన్న, కోల వెంకన్న, కొంక శ్రీనివాసు, దుండిగాల ప్రసాదు, దుండిగాల యాదగిరి, బంటు ఎల్లమ్మ, నక్క శేఖర్, ఆవదారపు చిన్న ఈదయ, నక్క మట్టయ్య ,లింగంపల్లి రవి, కోల రాంబాబు, నక్క సైదులు, బంటు లక్ష్మీనారాయణ ఇతర సంఘం పెద్దలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment