అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ఐచర్ వ్యాన్ ను పోలీసులు పట్టివేత
మంచిర్యాల, మార్చి 13, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): రామగుండం కమీషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ ఉన్నతదికారుల ఆదేశం మేరకు పోలీసులు వాహనాలను తనిఖీలో నమ్మదగిన సమాచారంతో బుధవారం ఉదయం నాలుగు గంటలకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జన్నారం పోలీసులు పట్టుకున్నారు. దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ చెందిన ఓ వ్యాపారి వంద కింట్వాల్వ పిడిఎఫ్ బియ్యాన్ని అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఓ రైస్ మిల్లుకు తరలిస్తుండగా పోలీస్ ఉన్నతాధికారుల సమాచారం మేరకు జన్నారం పోలీసులు టీఎస్ 01 యుసి 5722 ఐచర్ వ్యాన్ లో పట్టుకున్నారు. పట్టుకున్న రేషన్ బియ్యం ఐచర్ వ్యానును జన్నారం పోలీస్ స్టేషన్ లో పెట్టారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న నిందితుడు పరారీలో ఉన్నారని సమాచారం. జన్నారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కవ్వాల్ అభయారణ్యంలో రాత్రి 9 నుండి ఉదయం 6 గంటలకు వాహనాల రాకపోకలు నిలిపివేత
కవ్వాల్ అభయారణ్యంలో అటవీ శాఖ అధికారులు రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం 6 గంటల వరకు వాహన రాకపోకులను నిలుపు వేయడం జరిగింది. బంగారం మండలంలోని తపాలాపూర్ చెక్ పోస్ట్ నుంచి బుధవారం తెల్లవారుజాము 6 గంటలకు టిఎస్ 01 యు సి 5722 గల అయితే వానను ఐచర్ వ్యానును ఎలా వదిలిపెట్టారని, జన్నారం మండలంలోని ప్రజలు వ్యాపారస్తులు గుసగుసలాడుకుంటున్నారు. జన్నారం మండలంలోని వ్యాపారస్తుల సామాగ్రిని రాత్రి సమయంలో అనుమతించరు కానీ, అక్రమంగా తరలిస్తున్న పేద ప్రజల రేషన్ బియ్యంతో వెళుతున్న వ్యానును అటవీ అధికారులు వదిలి వేస్తారా అని అనుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు వ్యాపారస్తుల సామాగ్రి, భారీ వాహనాలకు కవ్వాల్ అభయారణ్యంలో అనుమతించాలని ప్రజలు, వ్యాపారస్తులు కోరుతున్నారు.