Home తాజా వార్తలు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను చేరాలి

కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను చేరాలి

by Telangana Express

జనయేత్రీ ఫౌండేషన్ చైర్మన్ డా.మునిర్ అహ్మద్ షరిఫ్

ప్రతీ సంవత్సరం లాగే ఈసారి కూడా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని , పిల్లలకు పరీక్ష సమయంలో ప్యాడ్లు, పరీక్ష సామాగ్రి అందజేయడం
వారి ఉజ్వల భవిష్యత్తు కోసం వారు పరిక్షలు రాయడంలో ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ముందుకు సాగలని కోరుకుంటూ డా.A శరత్
I A S బ్రదర్స్, జనయేత్రీ ఫౌండేషన్ వారు కలిసి సంయుక్తంగా బంగారి గడ్డ ప్రభుత్వ పాఠశాలలో, పరీక్ష రాయబోతున్న విద్యార్థులందరికీ పరీక్ష ఫ్యాడ్లు, పెన్నులు, ఐస్ మ్యాట్ లు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వన్ టౌన్ ఎస్సై శ్రీను నాయక్ పాల్గోని విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఏ విధమైన ఆందోళన చెందకూడదని, ఎగ్జామ్స్ సెంటర్ కి అరగంట ముందే చేరుకొని ఉండాలని అన్నారు. జనయేత్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. మునిర్ అహ్మద్ షరిఫ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గవర్నమెంట్ స్కూల్స్ లో మా ఫౌండేషన్ తరుపున ఫ్యాడ్స్, పెన్నులు, నోట్ బుక్స్ అందిస్తున్నామని, విద్యార్థులు ఎగ్జామ్స్ రాసి మంచి ఫలితాలు సాధించి చదువు చెప్పిన గురువులకు, తల్లితండ్రులకూ మంచి పేరు తేవాలని కోరారు. SS ఫౌండేషన్ కార్యదర్శి శశిధర్ ఆధ్వర్యంలో విద్యార్థులకి ఫ్యాడ్స్, పెన్నులు, ఐస్ మ్యాట్ అందించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానో ఉపాధ్యాయులు లక్ష్మి, ఉపాధ్యాయిని ఉపాధ్యాయురాలు కాట, వీర రాఘవులు, ఇందుమని, ఎల్లమ్మ, రజని, సుకుమారి, విజయలక్ష్మి, షమీం అఖ్తర్, వెంకటయ్య,
బంగారిగడ్డ కౌన్సిలర్ ఫర్జానా మోయీస్, కేరళీ స్కూల్ కరస్పాండెంట్ అహ్మద్, అమీర్అలి పోగుల సందిప్, యాదగిరి, సాయి, షాహీర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment