Home తాజా వార్తలు ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం

ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ పత్రిక మార్చి 13 వేములవాడ
శ్రీ రాజరాజేశ్వరాలయం లో 12 గంటల సమయం వరకు కూడా అన్న పూజ టికెట్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది దీనితో వచ్చిన భక్త జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్న పూజ టికెట్లు ఎన్ని గంటల వరకు ఇస్తానని కనిపించని ఫ్లెక్సీలు.

వచ్చిన భక్తులకు కనీసం అర్థం కాకుండా ఒక అట్ట ఒక్క పై రాసిన వైనం. ( ఆది సోమవారాలలో గర్భాలయంలోకి భక్తుల ప్రవేశం లేదు. అన్నపూజ .ఆకుల పూజ జరుపబడవు అని రాసారు ) లడ్డు, పులిహార అమ్మకాల్లో ఘరానా మోసం. లడ్డు100గ్రా , పులిహోర 150 గ్రా కంటే తక్కువ బరువులలో అమ్మకాలు. ఆలయంలో కొబ్బరికాయ కొట్టుటకు టికెట్ అవసరం లేదు.

కానీ వచ్చిన భక్తుల నుండి కొబ్బరికాయక కొట్టుటకు 5 నుంచి 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. వచ్చిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిపై విచారణ జరపాలని కోరారు. వచ్చిన భక్తులకు కనీసం త్రాగునీటి సదుపాయం అందించని ఆలయ సిబ్బంది. త్రాగునీటి సదుపాయం లేకుండా నిరుపయోగంగా ఉన్న రాజన్న జల ప్రసాదం.( తాలం వేసి ఉన్న రాజన్న జల ప్రసాదం)

You may also like

Leave a Comment