రెండు కేంద్రాల్లో కలిపి 24 మంది గైర్హాజరు…
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఫ్లైయింగ్స్ స్వాడ్ బృందం…
– పరీక్ష కేంద్రాల సీఎస్ డీఓ లు
ఎల్లారెడ్డి, మార్చి 13,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల “ఎ” , ఆదర్శ కళాశాల “బి” పరీక్ష కేంద్రాల్లో, ఫిబ్రవరి 28 వ తేదీ నుంచి ప్రారంభమైన ఇంటర్ ప్రథమ పరీక్షలు, బుధవారం నాడు 11 వ రోజు ప్రథమ సంవత్సర పార్ట్ 3, కెమిస్ట్రీ1, కామర్స్ 1, (వొకేషనల్) ( సెట్ “సి” ) పరీక్ష ప్రశాంతంగా ముగిశాయని కేంద్రాల సీఎస్, డీఓ లు సి హెచ్. హే మచందర్, పి.సాయిబాబా, స్వప్న , పద్మ లు తెలిపారు. ఏ కేంద్రంలో 251 మందికి 247 మంది హాజరు కాగా 4 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. వొకేషనల్ 43 మంది విద్యార్థులకు గాను 34 మంది పరీక్షకు హాజరు కాగా 09 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. బి కేంద్రంలో 257 మంది విద్యార్థులకు గాను 246 మంది హాజ కాగా 11 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజయ్యారు. రెండు కేంద్రాల్లో కలిపి 24 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు సీఎస్, డీఓ లు తెలిపారు. ప్రథమ సంవత్సర పరీక్ష చివరి రోజున ఫ్లయింగ్ స్క్వాడ్ కె.శంకర్, బి.రాందాస్ బృందం తో పాటు స్థానిక తహశీల్దార్ అల్లం మహేందర్ కుమార్ లు “ఎ “, “బి” పరీక్ష కేంద్రాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి కాపీయింగ్ కు అవకాశం ఇవ్వకుండా పరీక్షలు నిర్వహించడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను ఎలాంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా , ఒక్కో విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రం లోనికి పంపించి, పక డ్బందీగా పరీక్ష నిర్వహించడం జరిగిందని సిఎస్, డి ఓ లు తెలిపారు. ప్రథమ సంవత్సర పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ ఉల్లాసంగా , స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళారు.