- బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకుడు (కుమ్మరి) కోడూరి చంద్రయ్య
మంచిర్యాల, మార్చి 12, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): ఆతుకూరి మల్లమాంబ మొల్లమాంబ 584 జయంతిని బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణా రాష్ట్ర నాయకుడు ( కుమ్మరి) కోడూరి చంద్రయ్య ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రెండు తెలుగు రాష్ట్రల ఆత్మీయ బీసీ కులాల తెలుగు ఆడపడుచు, తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

ఆనాటి కాలంలో మహిళలలో అభ్యుదయ భావాలు కల్గించిన మొదటి మహిళ రచయిత మెుల్లమాంబని గుర్తు చేశారు.
స్ర్తీకి విద్య అవసరం లేదు, అక్షరాస్యత వైపు అడుగులు వేయాల్సిన పనిలేదని, మహిళలను పక్కన పెట్టిన ఆనాటి కాలంతో అందరికీ సమాధానం చెప్పి రామాయణాన్ని తెలుగులో రచించిన తొలి తెలుగు కవయిత్రి మెుల్ల. తొలి తెలుగు కవయిత్రి, రామయణాన్ని తొలిసారిగా తెలుగులో రచించిన మొల్లమాంబ 15వ శతాబ్ధానికి చెందిన మహొన్నత వ్యక్తిరాలు. ఆ కాలంలో స్ర్తీ కవిత్వంపై, శూద్ర కవిత్వంపై పూర్తిగా నిషేదం ఉన్నప్పటికీ సరస్వతీ తనయులుగా ఉన్న స్ర్తీలు సాహిత్యంలో ఏ మాత్రం తక్కవ కాదని, ప్రకృతిని ఆరాధించి, సమాజాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు సాహిత్య ప్రియులేనన్న సత్యాన్ని అక్షర రూపం చేసింది ఆ మహనీయ మూర్తిరాలు మెుల్ల. స్పంధించే హృదయం, సాహిత్యం లో స్ర్తీలు కూడా తక్కువ కాదని నిరూపించింది మొల్లమాంబ. బడుగు, బలహీన వర్గాల నుండి ఉద్భయించిన తొలి తెలుగు కవయిత్రి.. 24 వేల శ్లోకాలతో, 7 ఖండాలతో ఉన్న రామాయణాన్ని 871 శ్లోకాలతో, 8 ఖండాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో సంక్షిప్తంగా, సరళ భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో రామయాణాన్ని రచించి తెలుగులోకి అనువదించిన తొలి కవయిత్రి మెుల్ల. నెల్లూరు జిల్లా, కలువాయి మండలం, గోపవరం గ్రామంలోని శ్రీకంఠ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మొల్లమాంబ తండ్రి కేశన్న పూజారిగా కొనసాగుతున్న సమయంలో ప్రతినిత్యం అందులోనే కూర్చొని, అకుంఠిత దీక్షతో మొక్కవోని ఆత్మ విశ్వాసంతో మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపుతూ తొలిసారిగా తెలుగులో రామయణాన్ని రచించింది. తాలపత్ర గ్రంధాలలో ఉన్నటువంటి మెుల్ల రచించిన తెలుగు రామయణాన్ని నేడు వాడుక బాషలో మొల్ల రామయాణంగా గుర్తిస్తారు.
తాలపత్ర గ్రంధాలలో నిక్షిప్తమైనటువంటి మొల్ల రామయణాన్ని రూపుతో ఉన్నటువంటి విగ్రహాలను, రామయణాన్ని రచించినటువంటి శ్రీకంఠ మల్లేశ్వర స్వామి దేవాలయాన్ని, మెుల్ల తండ్రి అయినటువంటి కేశన్న వ్యవసాయం చేసినటువంటి మొల్ల తోటని, నేటికి ఆధారాలుగ చూపించవచ్చు. సంబ్బాడ బీసీ కులాల ఆతుకూరి మెుల్లమాంబ చరిత్రను తెలుసుకోవాలి. కుమ్మర ఆడపడుచు, తొలి తెలుగు కవయిత్రిగా తెలుగు భాషలోకి రామాయణన్ని కేవలం ఐదు రోజుల్లోనే అందరికి అర్దమయ్యే విధంగా సరళ భాషలో అనువదించి చరిత్ర పుటలలో నిలిచిపోయిన ఆడపడుచు ఆతుకూరి మొల్లమాంబ కుమ్మరి జాతికి ఎంతో గర్వకారణం. నాటికాలంలోనె మహోన్నత అభ్యుదయ భావాలుకలిగిన స్త్రీ మూర్తి, కుమ్మర్ల ఆడపడుచుని గర్వంగా చెప్పుకోవాలి. హైదరాబాదు ట్యాంక్ బండ్ పై ఎన్ టి రామారావు ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో నెలకొల్పిన మొల్ల మాంబ విగ్రహ వేదిక వద్డ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న మొల్లమాంబ జయంతోత్సవానికి సంబ్బాడ కుల సంఘాల నాయకులు, కుమ్మరి యువకులు అధిక సంఖ్యలో అందరూ ట్యాంక్ బండ్ కితరలివచ్చిమొల్లమాంబ విగ్రహానికి వందనం సమర్పింపించండిని తెలిపారు. తొలి తెలుగు రచయిత్రి కుమ్మరి ఆడపడుచు జయంతోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించాలని గ్రామ, మండల, జిల్లా స్ధాయిలలో మొల్లమాంబ జయంతోత్సవాలు నిర్వహించికొని ఐకమత్యాన్ని ఔన్నత్యాన్ని చాటి చెబుదాం. బీసి కులాల ఏకం కావాల్సిన సమయం వచ్చింది.