మేళ్లచెరువు మార్చి 8 :-
తెలంగాణ ఎక్స్ ప్రెస్
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మం డల కేంద్రంలో మహాశివరాత్రి పర్వది నాన మేళ్లచెరువు లోని శ్రీ స్వయం భూ శంభు లింగేశ్వర స్వామి వారిని ఉదయం నాలుగు గంటలకు కోదాడ శాసనసభ్యులు నలమాధ ఉత్తమ్ పద్మావతి ఆలయంలో అభిషేకం ప్రారంభించారు అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజ లు నిర్వహించి ప్రజలందరూ సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని శాసన సభ్యులు పద్మా వతి ప్రార్ధనలు చేశారు అనంతరం ఆలయ చైర్మన్ శాగం రెడ్డి శంభిరెడ్డి ఆలయ మర్యాదలతో ఘనంగా స త్కరించారు పిమ్మట టీటీడీకల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని ప్రారంభించి భక్తులకు అన్నదానం చేశారు అక్కడనుండి జాతీయస్థాయి వృషభ రాజుల బం డలాగుట ప్రదర్శన( ఎద్దుల పోటీ) ను ప్రారంభించారు రెండు పండ్ల వి భాగం ప్రారంభమైనదని 12వ తేదీ మంగళవారం వరకు ఈ పోటీలు ని ర్వహించడం జరుగుతుందని తెలి పారు మహాశివరాత్రి జాతర సంద ర్భంగా ఆలయంలో ఐదు రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని స్వామివారి దర్శ నం చేసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు మహాశివరాత్రి జా తరకు అధికారులు మంచిగా ఏర్పా టు చేశారని అధికారులు అందరికీ తన అభినందనలు తెలిపారు అక్క డనుండి శాసనసభ్యులు అయ్యప్ప స్వామి టెంపుల్ వెనకాల ఏర్పాటు చేసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వా మి దేవాలయ విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొట్టే పద్మ సైదేశ్వర రావు జడ్పిటిసి శాగం రెడ్డి పద్మ గోవింద రెడ్డి కాకునూరి భాస్కర్ రెడ్డి దేవా దాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్,జడ్పీ సీఈవో అప్పారావు ఆర్డిఓ శ్రీనివాసు తాసి ల్దార్ జ్యోతి ఎంపీడీవో అజ్గార్ అలీ ఏసీపి ఎం నాగేశ్వరరావు డిఎస్పి, సిఐ రజితా రెడ్డి, ఎస్సై పరమేష్ అధికారులు నాయకులు వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు
