Home తాజా వార్తలు మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలి

by V.Rajendernath

ఎల్లారెడ్డి, మార్చి 7:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని, ఎల్లారెడ్డి డిఎస్పీ ఎ. శ్రీనివాసులు సూచించారు. గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక రోజు ముందు గానే ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి గౌండ్ల హారికను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఇంకా వివక్షతకు గురవుతూనే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సి.రవీంద్ర నాయక్, ఎస్ ఐ. బొజ్జ మహేష్, పోలీసులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు వున్నారు.

You may also like

Leave a Comment