మంచిర్యాల, మార్చి 07, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం ధర్మారం గ్రామపంచాయతీ పరిధి గోండుగూడెం నుంచి గోదావరి వెళ్లే రహదారి మరమ్మత్తులు నాసిరకంగా జరుగుతున్నాయని, రోడ్డుపై కంకర పోస్తూ, అక్కడక్కడ మట్టిపోస్తూ, కాంట్రాక్టర్ చేతులు దులుపు కుంటున్నాడని, ఎటువంటి రోలర్ తొక్కించడం గాని, నీరు పోయడం జరుగుత లేదని, గురువారం మంచిర్యాల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కే అశోక్, జన్నారం మండల ప్రధాన కార్యదర్శులు ఎస్కే అబ్దుల్లా ఆరోపించారు. ఈ సందర్భంగా మహశివరాత్రి పునస్కరించుకొని రోడ్డు పుష్కరాలకు వేళ్లే భక్తులు కాకుండా ప్రతిరోజు గ్రామ ప్రజలు గోదావరి రోడ్డు కు ప్రజా రవాణా ఉంటుందని, రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం చేయకూడదని, అధికారులు పర్యవేక్షించి రోడ్డు నిర్మాణం సరిగ్గా జరిగే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. గోదావరికి వెళ్లే రోడ్డు నిర్మాణ పనులు సరిగ్గా జరగనియెడల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని, వ్యవసాయ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం కార్యదర్శులు హెచ్చరించారు.
ధర్మారం గోండుగూడా నుంచి గోదావరి వరకు నాసిరకం రోడ్డు మరమ్మత్తు
60