ఎల్లారెడ్డి, మార్చి 7,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం గ్రామ శివారులోని పందిరిగుండు పరమేశ్వరుని ఆలయం వద్ద , శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని, శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రామ కమిటీ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వేద పండితులు నరేష్ పంతులు అధ్వర్యంలో పూజా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శివలింగానికి నమక , చమకాలతో, జలాభిషేకం, పుష్పార్చన, తదితర పూజలను , అభిషేకాలు చేస్తున్నట్లు, గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం రుద్రారం గ్రామ హనుమాన్ ఆలయం నుంచి గ్రామ శివారులోని పందిరి గుండు పరమేశుని ఆలయం వరకు మహాదేవుని పల్లకీ సేవ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రాత్రి 9.00 గంటల నుంచి అర్థ రాత్రి లింగోద్భవ కాలం వరకు గ్రామానికి చెందిన భక్తులతో భజన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. శనివారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం వరకు భక్తుల కోసం ఆన్న ప్రసాదం కార్యక్రమం చేపడుతున్నట్లు గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు.